Monday, May 26, 2025

గర్ల్‌ఫ్రెండ్ ప్రాణం తీసిన చికెన్ ముక్క

బాయ్‌ఫ్రెండ్‌‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన యువతి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 23 రాత్రి డిన్నర్‌కు వెళ్లిన ఆమె చికెన్ పీస్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయింది. సరదాగా లవర్స్ డిన్నర్ చేద్దామని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. 27ఏళ్ల మహిళ మే23న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాత్రి డిన్నర్‌కు వెళ్లింది. చికెన్ ఆర్డర్ చేసి తింటున్నారు.

భోజనం చేస్తుండగా చికెన్‌ పీస్‌ ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి అందకపోవడంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికెన్‌ పీస్‌ గొంతులో ఇరుక్కోవడం వల్లనే ఆ మహిళ చనిపోయిందా లేక మరో కారణంతోనా అన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని పోలీస్‌ అధికారి తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com