Monday, April 21, 2025

శేషాచలం అడవుల్లో అరుదైన బంగారు బల్లి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరుదైన బల్లి కనిపించింది. తిరుమల తిరుపతి శేషాచలం అడవుల్లో అరుదైన జాతికి చెందిన బంగారు బల్లిని గుర్తించారు. గురువారం వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్లకు ఈ బంగారు బల్లి కనిపించింది. ఏపీ అటవీశాఖ షెడ్యూల్‌-1 కింద పరిగణిస్తున్న బంగారు బల్లి చీకటి ప్రదేశాల్లో, రాతిబండల్లో నివసిస్తుంది. పసిడి వర్ణంలో మెరిసిపోయే ఈ బల్లుల జాడ ఈ మధ్య కాలంలో లేకుండా పోయిందని జంతుశాష్ట్ర నిపుణులు చెబుతున్నారు. తాజాగా కల్యాణిడ్యాం పరిధిలో ఈ బంగారు బల్లిని గుర్తించారు. జంతుశాస్త్రంలో ఈ బల్లిని గోల్డెన్‌ గెకో గా పిలుస్తారు. చాలా యేళ్ల తరువాత బంగారు బల్లి కనిపించిందని, శేషాచలం అడవుల్లో బంగారు బల్లులు ఇంకా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బంగారు బల్లిని చూస్తే శుభం కలుగుతుందని కొంత మంది నమ్ముతారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com