Monday, July 8, 2024

భారత్ లో అందుబాటులోకి 132 సీట్ల బస్సు

విమానంలో ఉండే సకల సౌకర్యాలు

భారత్ లో 132 సీట్ల సామర్థ్యంతో కూడిన ప్రత్యేక బస్సు రోడ్లపై పరుగుతీయనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ లో చేపట్టే ఈ పైలట్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబందించిన వివరాలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఢిల్లీలో వివరించారు. టాటా సంస్థతో కలిసి నాగ్‌పూర్‌ లో ఈ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టినట్లు ఆయన తెలిపారు. చెక్ రిపబ్లిక్‌ పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ మూడు బస్సులు కలిపిన ట్రాలీ బస్సు ను చూసి మన దేశంలోను ఇలాంటివి అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారట నితిన్ గడ్కరీ.

ఇక నాగ్ పూర్ లో రూపొందుతున్న ఈ ప్రత్యేక బస్సులో 132 మంది కూర్చునే సీటింగ్ ఉంటుంది. రింగ్ రోడ్‌ లో 49 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించి 40 కిలో మీటర్ల తర్వాత బస్‌స్టాప్‌ లో ఆగుతుంది. కేవలం 40 సెకన్లలో మళ్లీ 40 కిలోమీటర్లకి ఛార్జ్ అవుతుంది. విమానంలో ఉండే విధంగా సౌకర్యాలు, ల్యాప్ టాప్ పెట్టుకోవడానికి వీలుగా విశాలమైన సీట్లు, ఫ్లైట్ లో ఉండేమాదిరిగానే బస్ హోస్టెస్ ఇందులో ఉంటారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారు. ప్రయాణికులకు పండ్లు, ప్యాక్డ్ ఫుడ్, పానీయాలు అందజేయడానికి ఏర్పాట్లు సైతం ఉంటాయట ఈ బస్సులో.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular