మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్ జెండర్ లకు మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా క్లినిక్ ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపర్డెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రతి మంగళవారం ట్రాంజెండర్లు గ్రౌండ్ ఫ్లోర్ లోని రూమ్ నెంబర్ 15 లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్లినిక్ లో వైద్య సేవలు పొందవచ్చని సూచించారు. ట్రాన్స్ జెండర్ లకు ప్రత్యేకంగా క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల ట్రాన్స్ జెండర్ లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.