Friday, April 18, 2025

కొత్త బీర్ల కంపెనీలకు తాత్కాలిక బ్రేక్

రాష్ట్ర ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన లైసెన్సులను తాత్కాలికంగా నిలిపివేసినట్టుగా సమాచారం. మద్యం ప్రియుల నుంచి వ్యతిరేకత, కొత్త కంపెనీల నుంచి వస్తున్న ఉత్పత్తుల నాణ్యత, ప్రామాణికతపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కొన్ని రోజులు ఈ బ్రాండ్‌లను అమ్మవద్దని నిర్ణయించినట్టుగా సమాచారం. సోషల్ మీడియాలో కొత్త బీర్ బ్రాండ్లపై నెటిజన్లు తమ వ్యతిరేకతను కూడా వ్యక్తం చేశారు. దీంతో కొత్త మద్యం బ్రాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు తెరలేచింది.

కొత్త మద్యం బ్రాండ్ల వ్యవహారం తలనొప్పిగా మారడంతో కొత్త కంపెనీలకు ఇవ్వాల్సిన అనుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో కొత్త బీర్లు సరఫరా చేసేందుకు రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త కంపెనీలకు అనుమతి ఇచ్చింది. ఈ ఐదు కంపెనీలు తెలంగాణలో దాదాపు 27 రకాల బీర్లను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేశాయి.

లైసెన్సు పొందిన కొన్ని కంపెనీలకు సరైన నేపథ్యం లేకపోవడం, కొన్ని చోట్ల కల్తీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు కథనాలు రావడంతో ప్రజల నుంచి, మద్యం ప్రియుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటికి ఇచ్చే అనుమతులను ప్రస్తుతానికి ప్రభుత్వం నిలిపివేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com