Wednesday, April 9, 2025

రాష్ట్రంలో మరో సంచలన పరిణామం

ముగ్గురు ఐఎఎస్‌ల భూఆక్రమణల నిర్ణయాలపై
ఇడికి కొండాపూర్ వాసుల ఫిర్యాదు
ట్రస్ట్ భూమిని ప్రైవేట్ సంస్థకు దారాదత్తం
మాజీ సిఎస్ సోమేష్ కుమార్‌పై బిగుస్తున్న ఉచ్చు

రాష్ట్రంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్‌లు నవీన్ మిట్టల్, సోమేష్ కుమార్, అమోయ్ కుమార్‌పై కొందరు ఇడికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ , భూదాన్ భూములను అప్పనంగా తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారని ఆరోప ణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ పై ఈడీ విచారణ వేగవంతం చేసింది. అయితే, ఆ ఘటన మరువక ముందే తాజాగా అమోయ్ కుమార్‌తో సహా ఐఎఎస్ నవీన్ మిట్టల్, మాజీ సిఎస్ సోమేష్ కుమార్‌లపై కొండపూర్ వాసులు ఇడి అధికారులకు ఫిర్యాదు చేశారు.

కొండాపూర్ ప్రాంతంలోని మీజీద్ బండీ లో ఉన్న 88 ఎకరాలను బాలసాయి ట్రస్ట్‌కు ఓ కుటుంబం దానం చేసింది. కాగా, ట్రస్ట్ భూమిపై కన్నేసిన అధికారులు అదే భూమిలో నుంచి భూపతి అసోసియేట్స్ అనే ప్రైవేటు సంస్థకు 42 ఎకరాలు కేటాయిస్తూ అక్రమంగా జీవో నెం.45ను జారీ చేశారని బాధితులు ఇడికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తమ భూమికి సంబంధించి ముగ్గురు ఐఎఎస్‌లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి మోసం చేశారని ఫిర్యాదులో వెల్లడించారు. కాగా ఇప్పటికే భూదాన్ ప్రభుత్వం భూ కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై రెండు రోజుల పాటు ఇడి అమోయ్ కుమార్‌ను ఇడి విచారించిన సంగతి విదితమే.
former CS Somesh Kumar,IAS Naveen Mittal, Somesh Kumar,Amoy Kumar

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com