అందుబాటులో లేని న్యాయవాది.. మళ్లీ వాయిదా
జర్నలిస్టుపై దాడి కేసులో సినీ నటుడు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వాయిదా వేసింది. సోమవారం మోహన్ బాబు బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ అందుబాటులో లేకపోవడంతో మోహన్ బాబు తరఫు న్యాయవాది ధర్మాసనాన్ని పాస్ ఓవర్ కోరారు.
అయితే ఇందుకు న్యాయమూర్తులు అంగీకరించలేదు. దీంతో కేసు విచారణను గురువారానికి వాయిదా వేశారు. కొద్దిసేపటి తర్వాత సుప్రీంకోర్టు వద్దకు ముకుల్ రోహత్గీ చేరుకున్నారు. బెయిల్ పిటిషన్‌ను విచారించాలని విజ్ఞప్తి చేశారు. దీనికి ససేమిరా అన్న ధర్మాసనం.. గురువారానికి కేసు విచారణను వాయిదా వేసినట్లు తెలిపింది.