Sunday, November 17, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టులో కవితకు ఘనస్వాగతం

ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు. కేటీఆర్, భర్త, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కొద్దిసేపటిక్రితం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు కవితకు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి భారీ ర్యాలీగా ఆమె బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్ళనున్నారు.ఇప్పటికే కవితను కలిసేందుకు తల్లి శోభ ఆమె నివాసానికి వెళ్లారు. రేపు మధ్యాహ్నం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ ను కవిత కలుస్తారని తెలుస్తోంది.

కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో మంగళవారం ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు కవితకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో రూ.10 లక్షల విలువైన షూరిటీలను సమర్పించాలని చెప్పింది. పాస్ పోర్టు కూడా అధికారులకు అప్పగించాలని.. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లొద్దని ఆదేశించింది. దీంతో దాదాపు 5 నెలలకు పైగా జైలు జీవితం గడిపిన కవిత నిన్న రాత్రి 9 గంటల తర్వాత జైలు నంచి విడుదల అయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular