Monday, March 10, 2025

2 వేల పందెం కోసం మున్నేరులో దూకిన యువకుడు

మధ్యం మనిషి చేత ఏమైనా చేయిస్తుంది. ఒళ్లు తెలియకుండా మందు తాగితే కొందరు ఏంచేస్తున్నారో వాళ్లకే తెలియదు. ఆంధ్రప్రదేశ్ లో ఓ యువకుడు ఫుల్ గా మధ్యం తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో ఈ విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. నందిగామకు చెందిన మాడుగుల చంటి, మరొక యువకుడు ఫుల్ గా మద్యం తాగి పందెం వేసుకున్నారు. మున్నేరు వరదలో దూకి ఎవరైతే ముందుగా ఒడ్డుకు వస్తారో వారికి ఓడిపోయిన వాడు 2 వేల రూపాయలు ఇవ్వాలి. పందెం ప్రకారం మున్నేరు వంతెన వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరదలో ఇద్దరూ దూకారు.

నదిలో దూకి తిరిగొస్తానంటూ పందెం కాసిన వ్యక్తి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. అతడి వెనకాలే ప్రవాహంలో దూకిన పందెం కాయించిన వ్యక్తి చంటి మాత్రం గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకొని బోటుతో గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు రెండు గంటలు గాలించిన తర్వాత చంటి మృతదేహం లభించింది. దీంతో చంటి కుటుంబంలో విషాదం నెలకొంది. కేవలం రెండు వేల రూపాయల కోసం మధ్యం మత్తులో ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన అందరిని కలిచివేస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com