థియోటర్ల మూసివేత వివాదం రాజకీయ రంగు పులుముకుంది. సినీ వర్గాల్లోనే చిచ్చు పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన హరహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియోటర్ల మూసివేత నిర్ణయం తీసుకోవడంపై అటు పవన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, కేవలం సినీ ఇండస్ట్రీని కేవలం నలుగురు మాత్రమే నడిపిస్తున్నారనే వ్యాఖ్యలు ఇటీవల సంచలనంగా మారాయి. ఇలాంటి సమయంలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ తాను ఆ నలుగురిలో లేను అంటూ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం, తెలుగు సినీ పరిశ్రమ మధ్య నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తాను కూడా ఆ నలుగురిలో లేనని అన్నారు. అంతేకాదు.. సినీ ఇండస్ట్రీలో ఆ నలుగురు విలన్లు అంటూ ప్రస్తావించారు. తాను అంతా సింగిల్ అని, సోలోగా ఉంటున్నానన్నారు. అంతేకాకుండా తాను ఇప్పుడు చాలా ఎత్తుకు ఎదిగానని, తాను కేవలం తెలుగు మాత్రమే కాకుండా.. హైరేంజ్‌కు వెళ్తున్నాన్నారు. ఇక, రాష్ట్రంలో సినిమా థియోటర్లు మూసివేసే పరిస్థితులు ఉన్నాయని, ఇప్పటికిప్పుడు 50 థియోటర్లు మూసివేసేందుకు సిద్ధంగా ఉంటే తామే వారికి సర్థి చెప్పి థియోటర్లు నడిపిస్తున్నట్లు చెప్పారు. నైజాంలో మొత్తం 370 సింగిల్ థియేటర్లు ఉంటే, ఎస్వీసీఎస్, తమకు సంబంధించినవి కేవలం 30 మాత్రమే ఉన్నాయని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు అన్నారు.