లేడీ పవర్‌స్టార్ అంటే చాలు టాలీవుడ్‌లో ఓ క్రేజ్ ఉంది. ఇంతకీ ఎవరో తెలుసుకదా..హైబ్రిడ్ పిల్ల ఒక్కటే పీస్ సాయిపల్లవి. ఇక ఈమెను ఒక కథ చెప్పి దాంట్లో నటించడానికి ఒప్పించాలంటే దర్శకులకు తల ప్రాణం తోకకి వస్తది అంటారు కదా అలా ఉంటది. ఆమెకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంత తేలికగా ఒప్పుకోదు. అలాగే పాత్రల విషయంలో కూడా ఆచి తూచి అడుగుతు వేస్తది. రెమ్యూనరేషన్ ఎంత ఆఫర్ చేసినా సరే తాను అనుకు్నన గీత మాత్రం దాటదు. ఆమె నుంచి ఓ కథ విన్నాక యస్ అనే పదం రావాలంటే చాలా కష్టపడాలి. మరి అలాంటిది ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో నితీష్ తివారితో కలిసి ఓ చిత్రం చేయబోతుంది. అందులో ఆమె సీత పాత్రని పోషిస్తుంది. ఇక దీంతో ప్రస్తుతం బాలీవుడ్‌లోని బడా నిర్మాతల కళ్ళన్నీ సాయిపల్లవిపైనే పడ్డాయి. ఆమెకోసం నిర్మాతలు క్యూ కడుతున్నారనుకోండి. ఉదాహరణకు కరణ్‌జొహర్ ప్రస్తుతం ఆమెతో సినిమా తీయాలనుకుంటున్నారు. ధర్మ ప్రొడక్షన్స్‌లో ఆమెకు ఆఫర్ ఇద్దామని చూస్తున్నారు. మరి ఇది ఆయ్యే పనేనా అంటే కాస్త కష్టమే అని చెప్పాలి. ఎందుకంటారా… కరణ్ టేస్టేమో కాస్త రొమాంటిక్‌గా ఉంటుంది. ఆయన తీసే చిత్రాలన్నీ రొమాంటిక్ చిత్రాలు తీస్తారు. మన సాయిపల్లవి ఏమో రొమాన్స్‌కి గ్లామర్ పాత్రలకి కాస్త దూరంగ ఉంటది. మరి ఇది జరిగే పనేనో కాదో తెర మీద వేచి చూడాలి మరి.