025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ వార్షిక ప్రణాళికను ప్రభుత్వం శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టింది. ఉపముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టగా, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాసనమండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఈసారి బడ్జెట్‌లో ఎక్కువ కేటాయింపులు చేశారు. ఆరు గ్యారంటీలకు రూ.56,084 కోట్లు కేటాయింపు చేయగా.. రైతు భరోసా – రూ.18 వేల కోట్లు, చేయూత పింఛన్లు – రూ.14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు – రూ.12,571 కోట్లు, మహాలక్ష్మి (ఆర్టీసీ బస్సు) రూ.4,305 కోట్లు, గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) రూ.2,080 కోట్లు, సన్నాలకు బోనస్ – రూ.1,800 కోట్లు, రాజీవ్ ఆరోగ్యశ్రీ – రూ.1,143 కోట్లు, గ్యాస్ సిలిండర్ రాయితీ – రూ.723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – రూ.600 కోట్లు, విద్యుత్ రాయితీ – రూ.11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం రూ.6 వేల కోట్లు కేటాయించి.. గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు.