13 మంది ఓపిఓల సస్పెండ్
బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై ఓపిఓలకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు నిర్లక్ష్యంగా వ్యవహరించి రాని 13 మంది ఓపిఓలను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయా సంబంధిత శాఖలకు చెందిన జిల్లా అధికారులు వివరణ సమర్పించవలసిందిగా కలెక్టర్ ఆదేశించారు.
శిక్షణ తరగతులు హాజరుకాని 13 మంది ఓపిఓలను ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.