నిజామాబాద్ జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంపై సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి వద్దనుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్టర్‌ను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలోని కవితా కాంప్లెక్స్ రెండవ అంతస్తులో ఉన్న జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంపై సోమవారం ఉదయం ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి కి సంబంధించిన ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ శ్రీరామరాజును సదరు వ్యక్తి వద్ద నుంచి రూ. 10 వేలు లంచం తీసుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు రిజిస్ట్రేషన్ కార్యాలయంపై దాడి చేసి లంచం డబ్బులతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. లంచం తీసుకున్న శ్రీరామరాజును అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.