ప్రస్తుతం ఈమె తమిళనాడులోని చెన్నైలో నివాసం ఉంటుంది. కొందరు దుండగులు ఈమెకు సంబంధించిన 4.26 కోట్ల రూపాయల విలువచేసే 600 గజాల స్థలానికి నకిలీ పత్రాలు సృష్టించారు. గత కొద్ది నెలల క్రితం ఈ ప్లాటును శ్రీనివాస్ రెడ్డి, భరత్ రెడ్డి లకు విక్రయించారు. ప్లాట్ యజమాని కెనడాలో ఉన్నారని ఆమె అక్కడి నుండే రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లుగా సంబంధిత నకిలీ పత్రాలను సృష్టించారు. ఈ పత్రాలతో మూసాపేట్ లోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు.
తన ప్లాట్ కు సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించారని తెలుసుకున్న యజమానురాలు గత నెలలో నగరానికి వచ్చి రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు 15 మంది నిందితులను గుర్తించారు. వారిలో ఏడు మంది నిందితులు ఇమ్మానియేల్, దివాకర్ వర్మ, పాల్సన్ సుభాషిని, నాగేష్ అలియాస్ నాగేశ్వరరావు, పుష్ప కుమారి, చంద్రమోహన్, వల్లి లను అరెస్టు చేశారు. మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు. వీరి వద్ద నుంచి 1.69 కోట్ల రూపాయల నగదు, మూడు కార్లు, 7 సెల్ ఫోన్లు, నాలుగు నకిలీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, అఖిల్ స్టాంపులు, మూడు కిలోల నకిలీ బంగారు బిల్లలు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో నిందితులు మరిన్ని అక్రమాలకు పాల్పడినట్లు తెలిసింది. నకిలీ బంగారం కూడా విక్రయించినట్లు అనుమానిస్తున్నారు. దీంతో నిందితులపై పిడి యాక్ట్ పెట్టనున్నామని పోలీసులు తెలిపారు. మూసాపేట్ సబ్ రిజిస్టర్ తో పాటు కార్యాలయ సిబ్బంది చేతివాటం ఉన్నదని కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.