- అక్రమాలకు పాల్పడుతున్న ఫాదర్‌పై చర్యలు తీసుకోవాలి
- డిజిపికి ఫిర్యాదు చేసిన ఏఐసిసి మాజీ మెంబర్
అక్రమాలకు పాల్పడుతున్న (ఫాదర్) ఆరోగ్య రెడ్డిపై ఏఐసిసి మాజీ మెంబర్ బక్క జడ్సన్ డిజిపి ఫిర్యాదు చేశారు. మరియా ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకుడు ఆంథోనీ మబ్లీ 1986లో రాయదుర్గం దగ్గర కొన్న 22 ప్లాట్‌ల నుంచి హైదరాబాద్ డయాసిస్‌కు, చర్చి నిర్మాణం కోసం నాలుగు ఎకరాలు ఇచ్చారు. తర్వాత ఆయన ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకొని ఆంథోనీ మబ్లీ తన కూతురు దగ్గర ఆ దస్తావేజులను భద్రపరిచారు. 2020లో ఆంథోనీ మరణించిన అనంతరం ఆ భూములు కాజేయడానికి రియల్టర్ పాపిరెడ్డి, జార్జిరెడ్డి, కానిస్టేబుల్ నగేష్‌తో ఆరోగ్యరెడ్డి ప్లాన్ చేసి ఆ భూములను ఆక్రమించుకున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేసి దర్యాప్తు చేయాలని రాష్ట్ర డిజిపికి బక్క జడ్సన్ సోమవారం ఫిర్యాదు చేశారు.