Thursday, September 19, 2024

జాతీయ లోక్ అదాలత్ లో కేసులు సత్వర పరిష్కార దిశ గా చర్యలు

  • రాజీ మార్గమే రాజ మార్గం
  • జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గంధం సునీత

రాజమహేంద్రవరం, జాతీయ లోకాదలత్ లో వివిధ కేసులు సత్వర పరిష్కార దిశ గా చర్యలు తీసుకోవడం జరుగుతోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, గంధం సునీత అన్నారు. శనివారం 3 వ జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా జడ్జి గంధం సునీత పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా గంధం సునీత మాట్లాడుతూ రాజీ మార్గ మే రాజ మార్గం అన్నారు. ఉమ్మడి తూర్పు గో దావరి జిల్లాలో స్పెషల్ లోకాదలత్, జాతీయ లోకాదలత్ లో గత సంవత్సరంలో 100 కోట్లు రూపాయల వరకు లబ్ధిదారులకు నష్ట పరిహారం చెల్లించడం జరిగిందన్నారు.

సుప్రీం కోర్ట్, హైకోర్టు వారి ఆ దేశాల మేరకు ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాలు, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లబ్ధిదారులు చేసుకోవ చ్చన్నారు. వివిధ కేసులు రాజీ పడదగిన  కేసుల పరిష్కారా నికి  చొరవ చూపేందుకు రాజీ మార్గం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో డిఎల్ ఎస్ ఏ పని చేస్తుందని తెలిపారు.

జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చెయ్యడం వల్ల ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీ లకు కూడా ఎంతో మేలు జరిగే అంశం అని పేర్కొన్నారు. కక్షి దారుల్లో లోకాదలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం జరి గేలా చర్యలు తీసుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని తెలిపారు.

రాజీ పడతగ్గ కేసులను జాతీయ లోకాదలత్ లో రాజీ మార్గం ద్వారా 4 గురు లబ్ధిదారులకు నష్ట పరిహారం అవార్డు ఇవ్వడం జరిగిందన్నారు. నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అగ్ని ప్రమాదం జరిగిన సందర్భంగా అడబాల దేవి ప్రసాద్ ని వారికి కోటి ఆరు లక్షల రూపాయలు, శ్రీరామ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మాధురి శివశంకర్ వారికి 60 లక్షల రూపాయలు, టాటా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా బి. మహేష్ కు మార్ వారికి 25 లక్షల రూపాయలు, ఓరియంటల్ ఇన్సూ రెన్స్ కంపెనీ ద్వారా జి సతీష్ కుమార్ వారికి 20 లక్షల 75 వేల రూపాయలు లబ్ధిదారు లకు చెక్కులు అందించారు.

ఈ కార్యక్రమంలో లో 1వ అద నపు జిల్లా న్యాయమూర్తి ఆర్. శివకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరి యు సీనియర్ సివిల్ న్యాయ మూర్తి, కె.ప్రకాష్ బాబు, రాజమండ్రి బార్ అసోసియేషన్ సెక్రటరీ, పి.రమేష్, అదనపు జిల్లా న్యాయమూర్తులు, సీని యర్ సివిల్ న్యాయమూర్తులు జూనియర్ సివిల్ జడ్జిలు, లా యర్లు, డి ఎల్ ఎస్ ఎ సిబ్బం ది, కక్షి దారులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

నోట్ :- లోకాదలత్ లో పరిష్కరించిన గణాంకాల వివరాలను రాత్రి 8.30 గంటలకు అందజేయడం జరుగుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular