Thursday, May 15, 2025

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నటి అమీ జాక్సన్‌

ప్రముఖ నటి అమీ జాక్సన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గత కొంతకాలంగా హాలీవుడ్‌ నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్‌ తో ప్రేమలో ఉన్న అమీ జాక్సన్‌ ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. అమీ జాక్సన్, ఎడ్‌ వెస్ట్‌విక్‌ ల వివాహ వేడుక ఇటలీలో అంగరంగ వైభవంగా జరిగింది. తమ పెళ్లి ఫోటోలను సోషల్ మిడియా ద్వార అభిమానులతో పంచుకున్నారు ఇరువురు. కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. అంటూ అభిమానులకు తమ పెళ్లి వార్తను చెప్పారు. సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ఎడ్‌ వెస్ట్‌విక్‌ ను మొదటిసారి కలిశారట అమీ జాక్సన్. అలా మొదలైన పరిచయం కాస్త ప్రేమగా మారి ఇదిగో ఇప్పుడిలా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

అన్నట్లు అమీ జాక్సన్‌ గతంలో ఇంతకుముందు జార్జ్‌ పనియోటౌ అనే ప్రముఖ బిజినెస్ మ్యాన్ తో రిలేషన్‌షిప్‌లో ఉంది. కొన్నాళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంటకు ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. అమీ జాక్సన్, జార్జ్‌ పనియోటౌ లు నాలుగేళ్ల క్రితం 2020లో పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ కొవిడ్ కారణంగా వీరి వివాహం వాయిదా పడింది. ఆ తరువాత జరిగిన పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఇక అమీ జాక్సన్ ఎవడు, ఐ, 2. ఓ, మిషన్‌-ఛాప్టర్‌ 1, క్రాక్‌ తదితర సినిమాల్లో నటించింది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com