Sunday, November 24, 2024

అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలి

సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలి
కాంగ్రెస్‌ అ‌గ్రనేత నేత రాహుల్‌ ‌గాంధీ  డిమాండ్‌

లంచం ఆరోపణలపై అమెరికాలో కేసు నమోద్కెన అదానీ గ్రూప్‌ ‌ఛ్కెర్మన్‌ ‌గౌతమ్‌ అదానీని తక్షణమే అరెస్ట్ ‌చేయాలని కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ డిమాండ్‌ ‌చేశారు. సెబీ చీఫ్‌ ‌మాధభి పురీ బచ్‌పైనా విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జ్కెరాం రమేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. అమెరికా, భారత చట్టాలను అదానీ ఉల్లంఘించారనే విషయంపై ఇప్పుడు స్పష్టత వొచ్చిందని రాహుల్‌ ‌గాంధీ అన్నారు.

మోదీ, అదానీల బంధం భారత్‌లో ఉన్నంత వరకే సురక్షితమన్నారు. తాజా ఆరోపణలపై తక్షణమే జేపీసీతో విచారణ జరిపించాలన్నారు. శీతకాల సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతామన్నారు. తన అవినీతి ద్వారా దేశ ఆస్తులన్నీ అదానీ కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయనను వెంటనే అరెస్ట్ ‌చేసి విచారిస్తే విషయాలన్నీ బయట పడతాయని అన్నారు. ఆయనను రక్షిస్తున్న సెబీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తొలగించి ఆమె పైనా విచారణ జరపాలని డిమాండ్‌ ‌చేశారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సంబంధం లేకుండా విచారణ జరిపించాలని రాహుల్‌ ‌గాంధీ కోరారు. ‘అదానీ అరెస్టు కాడని, ఆయనపై విచారణ జరగదని నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన్ను మోదీ కాపాడుతున్నారు’ అని రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular