టీఎస్, న్యూస్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. మంగళవారంతో ఇద్దరి కస్టడీ ముగియడంతో ఉదయం ఇరువురిని పోలీసులు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఈనెల 6 వరకు అడిషనల్ ఎస్పీలకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నలను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
Also Read: 2014 నుంచే నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు
మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంకా పోలీసులకు చిక్కడం లేదు. విదేశాల్లో ఉండటంతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అయితే, సోమవారం రాత్రి వరకు ఆయన హైదరాబాద్ వస్తున్నారని పోలీసులు భావించారు. కానీ, ఇంకా ఆయన రాలేదని చెబుతున్నారు. ఒకవేళ ఆయన వస్తే పట్టుకునేందుకు మూడు టీంలను సిట్ పోలీసులు ఏర్పాటు చేశారు.