Monday, July 1, 2024

వర్షాకాలం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలి

అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలి
ఔటర్ లోపల ఉన్న సిసి కెమెరాలను కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేయాలి
ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు
హోం గార్డుల రిక్రూట్‌మెంట్ చేపట్టాలి
ఎఫ్‌ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్‌ను
హైదరాబాద్ ప్రజలకు అందించాలి
అధికారుల సమీక్షలో సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

వర్షాకాలం నేపథ్యంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి దిశానిర్ధేశం చేశారు. మంత్రులతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డిజిపి రవి గుప్తలతో కలిసి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ వర్షాకాల సమయంలో అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని అధికారులకు ఆయన సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డును యూనిట్‌గా తీసుకొని డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌ను ఇంటిగ్రేట్ చేయాలని సిఎం పేర్కొన్నారు.

గ్రేటర్ పరిధిలో 141 వరద తీవ్రత ప్రాంతాల గుర్తింపు
ఔటర్ లోపల ఉన్న సిసి కెమెరాలను వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి సిఎం రేవంత్, మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే 141 వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.

నీరు ఎక్కువ వచ్చి చేరే ప్రాంతాల నుంచి సునాయాసంగా వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రోడ్డుపై నీరు నిల్వకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు. ఎఫ్‌ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాట్లు చేయాలని సిఎం ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోం గార్డుల రిక్రూట్‌మెంట్ చేపట్టాలని అధికారులను సిఎం ఆదేశించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular