Wednesday, March 12, 2025

‘అది ద సర్‌ ప్రైజ్‌’…. ఏంది ఈ సర్‌ ప్రైజ్‌

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్ హుడ్’ సినిమా రూపొందింది. ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను పలకరించనుంది. రీసెంటుగా ఈ సినిమా నుంచి ‘అది దా సర్ ప్రైజ్’ అనే సాంగ్ ను వదిలారు. ఇది సినిమాలో స్పెషల్ సాంగ్. కేతిక శర్మ బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. జీవీ ప్రకాశ్ కుమార్ బాణీ కట్టిన ఈ పాటకి చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీని అందించాడు. ఈ తరహా పాటలు మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే కంపోజ్ చేస్తూ ఉంటారు. ఈ పాట విషయంలో కేతిక వేసిన ఒక ‘హుక్ స్టెప్’ మరీ అభ్యంతరకరంగా ఉందనే టాక్ సోషల్ మీడియాలో నడుస్తోంది. తన స్కర్టును తనే ముందుకు లాగుతూ కేతిక వేసిన ఈ హుక్ స్టెప్ చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందని అంటున్నారు. శేఖర్ మాస్టర్ కాస్త మోతాదు తగ్గించాలనే కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు హీరో వేసే ఇబ్బందికరమైన స్టెప్పుకు బదులుగా హీరోయిన్ తో మరో స్టెప్పు వేయించేవారు. ఆ తరువాత పాట అర్థం తెలియని హీరోయిన్స్ వచ్చాక, హీరోతో పాటు అదే స్టెప్పును పచ్చిగానే వేయించడం మొదలైంది. ఇక ఇప్పుడు ఐటమ్ పాట దగ్గరికి వచ్చేసరికి అది మరింత ముదిరిపోయింది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com