ఇండియన్ సినీ పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో శంకర్ ఒకరు. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, ఒకేఒక్కడు, జీన్స్, అపరిచితుడు, రోబో వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. ప్రస్తుతం భారతీయుడు 3 కి సంబంధించిన పనుల్లో ఉన్నాడు శంకర్. ఆయన పెధ్ద కూతురు అదితి శంకర్ 2022 లో కార్తీ హీరోగా తెరకెక్కిన ‘విరుమాన్’ తో హీరోయిన్ గా పరిచయమయ్యింది. ఆ తర్వాత మా వీరన్, నేసిప్పాయ వంటి చిత్రాల్లో నటించి మంచి నటిగా ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. సింగర్ గాను రాణిస్తు గేమ్ చేంజర్ తమిళ వెర్షన్ కి సంబంధించి ‘ధోప్’ సాంగ్ ని ఆలపించి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. ఈ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో భైరవం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం కాబోతుంది. సాయిశ్రీనివాస్, మంచుమనోజ్, నారా రోహిత్ హీరోలుగా చేస్తున్నారు. ఈ నెల 30 న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతు శంకర్ కూతురు అనే గుర్తింపుని ఒక గౌరవంగా భావిస్తాను. కానీ ఆ గుర్తింపు నాపై ఒత్తిడి పెంచుతుందని భావించను. మా నాన్నకి నేను చేస్తున్న సినిమాల గురించి ఏమి తెలియదు. ఆయన సినిమాలతో ఆయన బిజీగా ఉంటారు. కాకపోతే నా సినిమాలని మాత్రం తప్పకుండా నాన్న చూడాల్సిందే. పట్టు బట్టి మరి చూపిస్తాను. నటిగా నా ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఉన్నాయి.