Sunday, May 4, 2025

ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

  • ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
  • విచారణ జూలై 24కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
  • వేసవి సెలవుల తర్వాత విచారణ చేపట్టనున్న ధర్మాసనం

టీఎస్, న్యూస్ :సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఓటుకు నోటు వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం పేర్కొంది. దీంతో తదుపరి విచారణను జులై 24వ తేదీకి వాయిదా వేసింది.

అయితే, ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, రెండు వారాల్లో కేసుతో ముడిపడి ఉన్న చట్టపరమైన అంశాలతో కూడిన వివరాలను అందించేందుకు సమయం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయని, కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేదు కాబట్టి సెలవులు అనంతరం విచారణకు తీసుకోవాలని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్ర కోర్టును కోరారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com