ప్రభుత్వ పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఆగడం లేదు. మంగళవారం మధ్యాహ్నం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సాయిపూర్ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ కారణంగా 15 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటికే నారాయణపూర్, కరీంనగర్‌లో ఫుడ్ పాయిజన్ విషయం బయటకు వచ్చింది.
దీంతో ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను కూడా నియమించింది. వసతి గృహాల్లో వండే వంటలపై ప్రత్యేక ఆదేశాలు కూడా జారీ చేసింది. తాజాగా మళ్లీ ఫుడ్ పాయిజన్ విషయం బయట పడింది. సాయిపూరు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ సంఘటన జరిగింది. విద్యార్థినిలను వికారాబాద్ కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు.