భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్ఠితి నెలకొన్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయంత్రం చీకటి పడడంతో పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతూ.. డ్రోనులతో దాడులు చేస్తోంది. యూరీ, కుప్వారా, పూంఛ్, నౌగామ్ సెక్టార్లలో.. పాక్ సైన్యం కాల్పులు జరుపుతోంది. పాక్ ఎంత వేగంగా కాల్పులు జరుపుతుందో.. భారత్ అంతే వేగంతో వాటిని సమర్థవంతంగా తిప్పికోడుతోంది.
ఇక జైసల్మేర్, యూరీలో బ్లాక్ అవుట్ అయింది. అనంతరం సైరన్లు మోగాయి. అలాగే హర్యానాలోని పంచకులతోపాటు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో బ్లాక్ అవుట్ అయింది. జమ్మూ,అఖ్నూర్‌లో సైరన్లు మోగాయి. దీంతో ఆ ప్రాంతాన్నిబ్లాక్ అవుట్ చేశారు.