నడి రోడ్డుపై లాయర్ దారుణ హత్య
పట్టపగలు నడిరోడ్డుపై లాయర్ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. దస్తగిరి అనే ఎలక్ట్రీషియన్ ఓ మహిళను వేధింపులకు గురిచేయడంతో లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. మహిళ తరఫున ఫిర్యాదు చేయడంతో ఆగ్రహంతో.. నడిరోడ్డుపై కత్తితో పొడిచి లాయర్‌ను చంపాడు. సంతోష్ నగర్ న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయిల్ ఉంటున్నారు. ఎలక్ట్రీషియన్ దస్తగిరి ఇతన్ని నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స తీసుకుంటూ లాయర్ మృతి చెందాడు.
లాయర్ ఇజ్రాయిల్‌కు చెందిన ఇంట్లో దస్తగిరి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే దస్తగిరి ఓ మహిళను వేధింపులకు గురి చేస్తున్నాడని లాయర్ ఇజ్రాయిల్‌ను ఆశ్రయించింది. దీంతో లాయర్ మహిళ తరఫున దస్తగిరిపై ఫిర్యాదు చేశాడు. తనపైనే ఫిర్యాదు చేస్తారా? అని ఆగ్రహంతో లాయర్ ఇజ్రాయిల్‌ను దస్తగిరి కత్తితో పొడిచి చంపాడు. నాలుగు రోజుల నుంచి ప్లాన్ చేసి లాయర్ ఇజ్రాయిల్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది.