భవిష్యత్తు ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని, హైదరాబాద్ లో మరో కొత్త మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీని ప్రారంభించడం హైదరాబాద్ జర్నీలో ఇదొక మైలురాయిగా వర్ణించారు. తాజాగా చేసుకున్న భాగస్వామ్యంతో తెలంగాణలో మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడి తమ స్టార్టప్ ఎకో సిస్టమ్ బలోపేతం చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్ ను ఇస్తుందని సీఎం రేవంత్ చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ నూతన భవవాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్-హైదరాబాద్ మధ్య సుదీర్ఘ భాగస్వామ్యం ఉందన్నారు. మైక్రోసాఫ్ట్ ఇండియా ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకుందని, హైదరాబాద్ నుంచి గ్లోబల్ ఇన్నోవేషన్, ఇంపాక్ట్ క్రియేట్ చేశారని తెలిపారు. మైక్రోసాఫ్ట్ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించనున్నాయని వివరించారు. యువతకు మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు సీఎం అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్- తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఏఐ ఫౌండేషన్ అకాడమీతో భాగస్వాములుగా ఉన్నామని గుర్తు చేశారు. ఈ భాగస్వామ్యంతో తెలంగాణలో మైక్రోసాఫ్ట్ 500 ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యను ప్రవేశపెట్టడంతో పాటు గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించనున్నాయని తెలిపారు. ఈ పెట్టుబడి మా స్టార్టప్ ఎకో సి స్టమ్ బలోపేతం చేయడంతోపాటు మెంటార్షిప్, ఏఐ టూల్స్, గ్లోబల్ నెట్వర్క్ యాక్సెస్ ను ఇస్తుందన్నారు.
తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తున్నందుకు గర్వంగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ కేంద్రం ఏఐ నాలెడ్జ్ హబ్ సహా క్లౌడ్ ఆధారిత ఏఐ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తుందన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ లీడర్ షిప్ టీమ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆవిష్కరణల పట్ల మీ నిబద్ధత మా తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు మైక్రోసాఫ్ట్ తో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.