చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి
పార్టీని మరింత బలోపేతం చేస్తా
పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి
రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తా
ఎమ్మెల్సీ, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింనందుకు మహేశ్ కుమార్ గౌడ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తనపై అత్యంత నమ్మకంతో తనకు కీలకమైన టిపిసిసి అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ఆయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంట్ ప్రతి పక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్, ఏఐసిసి ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులకు, ఎంపిలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు, డిసిసి అధ్యక్షులకు, పార్టీ కోసం అనునిత్యం పాటు పడుతున్న నాయకులకు, కార్యకర్తలకు తన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియచేశారు.
పార్టీ అప్పగించిన ఈ గొప్ప బాధ్యతలను చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేస్తానని ఆయన పేర్కొన్నారు. నిరంతరం కార్యకర్తలకు, నాయకులకు అందుబాటులో ఉంటూ పార్టీకి, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేసి రాష్ట్రాభివృద్ధికి, పార్టీ పటిష్టతకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఇంతకాలం తనకు అన్ని రకాలుగా సహకరించిన నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు పదవి రావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.