Thursday, May 1, 2025

అజిత్‌ పరమనీచుడు- సీనియర్‌ హీరోయిన్‌ హీరా

అజిత్‌ అన్ని భాషల్లో ఫేమస్‌ అయిన హీరో. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా ఏ ఇండస్ట్రీకి వెళ్ళిన అజిత్‌ తెలియని వారుండరు.
తాజాగా ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మ భూషన్ అవార్డు కూడా అందుకున్నారు. ఇదే తరుణంలో అజిత్ పై తాజాగా ఒక స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. ఒకప్పుడు తెలుగు, హిందీ, తమిళ, ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది నటి హీరా. తన కెరియర్ పీక్స్ లో ఉన్న టైంలో వెండితెరపై నుండి సడెన్‌గా మాయమైపోయింది. అలాంటి ఈమె చాలా ఏళ్ల తర్వాత తాజాగా మీడియా ముందుకు వచ్చి అజిత్ పై సంచలన ఆరోపణలు చేసింది. అజిత్ తనను మోసం చేశాడని అజిత్ ఒక ఫ్రాడ్ అంటూ చెప్పుకొచ్చింది.

ఆ హీరో క్రిమినల్ మైండ్ చాలా దారుణంగా ఉంటుందని, హింస కోసం అభిమానులను రెచ్చగొడుతూ ఉంటారని అన్నది. అంతేకాదు తనకు సర్జరీలు అయ్యాయని అనారోగ్య సమస్యలు ఉన్నాయని అభిమానుల సింపతి పొందేలా ఆయన అబద్ధాలు మాట్లాడారని చెప్పుకొచ్చింది. అయితే హీరా అజిత్ తో కలిసి చాలా సినిమాల్లో నటించింది. వీరి మధ్య ప్రేమ యానం నడిచిందని కోలీవుడ్ లో చాలా వార్తలు వినిపించాయి.

కానీ ఇంతలో ఏమైందో ఏమో వీరి మధ్య బ్రేకప్ జరిగింది అజిత్ లైఫ్ లోకి షాలిని వచ్చేసింది. షాలినినే పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇక అప్పటినుంచి వీరి లైఫ్ హ్యాపీగా సాగుతోంది కానీ తాజాగా అజిత్ కు పద్మభూషణ్ అవార్డు రావడంతో మరోసారి హీరా అప్పట్లో అన్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అజిత్ పై మాజీ ప్రియురాలు హీరా రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది అజిత్ అభిమానులు హీరా రాజగోపాల్ పై మండిపడుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com