Thursday, January 9, 2025

అజిత్‌ సంక్రాంతి బరిలో లేకపోయినా… గేమ్ ఛేంజ్‌ అవుతుందా?

శంకర్‌ దర్శకత్వం వహించిన తాజా చిత్రం గేమ్‌ ఛేంజర్‌. గ్లోబల్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా నటించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. జనవరి 10వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది. ఈ క్రమంలో మేకర్స్ ఇప్పటికే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మూవీపై ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ కు తమిళనాడులో పెద్ద సవాలు ఎదురవ్వనుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటించిన విడాముయర్చి కూడా పొంగల్ కే విడుదల అవ్వనుందని ప్రకటన రావడంతో గేమ్ ఛేంజర్ కు రిస్క్ తప్పదని అంతా అంచనా వేశారు. గేమ్ ఛేంజర్ కు కంటెంట్ పరంగా బజ్ ఉన్నప్పటికీ.. థియేటర్లు భారీగా దక్కవని అంతా అన్నారు. దీంతో ఏం జరుగుతుందోనని డిస్కస్ చేసుకున్నారు. అదే సమయంలో అజిత్.. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్నారు. కొన్ని కారణాల వల్ల సినిమాను పొంగల్ కు రిలీజ్ చేయడం లేదని విడాముయర్చి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. దీంతో గేమ్ ఛేంజర్ కు తమిళ నాట రిస్క్ తప్పిందని అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు! కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విడాముయర్చి వాయిదా పడ్డాక అనేక సినిమాలు రిలీజ్ కు సిద్ధమైపోతున్నాయి. చెప్పాలంటే ఆరేడు చిత్రాలు క్యూ కట్టేస్తున్నాయి. ఎందుకంటే మనకు ఎలాగో సంక్రాంతి సీజన్ ఇంపార్టెంటో వాళ్లకు కూడా అంతే. ఇప్పటికే అరుణ్ విజయ్ వనంగన్.. సంక్రాంతికి రానున్నట్లు మేకర్స్ ఎప్పుడో ప్రకటించేశారు. ఇప్పుడు జయం రవి కాదలిక్కు నేరమిల్లై పొంగల్ రేసులో దిగనుంది. నటుడు సత్యరాజ్ కొడుకు సిబిరాజ్ టెన్ అవర్స్.. రిలీజ్ కు సిద్ధమవుతోంది. విజయ్ కాంత్ కొడుకు షణ్ముగ పాండియన్ ‘పదవి తలైవన్ కూడా అప్పుడే రిలీజ్ కానుంది. మెగా డాటర్ నిహారిక యాక్ట్ చేస్తున్న మద్రాస్ కారన్.. సంక్రాంతికే రానుంది. మరో రెండు చిన్న సినిమాలు తరుణం, సుమో కూడా విడుదల అవుతున్నాయి. అయితే వీటిన్నంటిపై ఒక్కో విషయం పరంగా ఆడియన్స్ లో మోస్తరు అంచనాలున్నాలు. అయితే గేమ్ ఛేంజర్ పై కూడా మంచి బజ్ ఉన్నప్పటికీ థియేటర్ల సర్దుబాటు విషయంలో కచ్చితంగా ఇబ్బందులు తప్పవు. ఏదేమైనా మౌత్ టాక్ పాజిటివ్ గా ఉంటే గేమ్ ఛేంజర్ దూసుకుపోవడం పక్కా. మరేం జరుగుతుందో వేచి చూడాలి. అయితే ఇది కథ కథనాలు ఎలా ఉన్నప్పటికీ శంకర్‌ ఈ సినిమా చాలా డిలే చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ ఈ కథపైన ఎందుకోగా ఎంత బజ్‌ క్రియేట్‌ చేసినప్పటికీ హిట్‌ అవుతుందనే నమ్మకాలు మాత్రం కాస్త తక్కువే ఉన్నాయని చెప్పాలి. సంక్రాంతి బరిలో ఎవరు నిలబడతారో వేచి చూడాల్సిందే మరి.

 

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com