Wednesday, April 9, 2025

అల్లు అర్జున్‌పై కేసు కరెక్టే

బాధ్యతారాహితంగా వ్యవహరించారు: అసెంబ్లీలో అక్బరుద్దీన్‌

సంథ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీసలాట ఘటనపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ వ్యవహార శైలిని ప్రస్తావించారు. పుష్ప-2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన తొక్కీసలాటలో ఓ మహిళ మృతి చెందినా హీరో సినిమాను చూసి వెళ్లారని అక్బరుద్దీన్‌ విమర్శించారు. దుర్ఘటనపై బాధ్యత లేకుండా సినిమా చూసి వెళ్లేటప్పుడు అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంగా వ్యవహరించారని అక్బరుద్దీన్‌ మండిపడ్డారు.

ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, మళ్లీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఇక, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కామెంట్స్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. సంథ్య థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్‌గా ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆ ఘటనను తప్పు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడిని అరెస్ట్ చేస్తే చాలా రాద్ధాంతం చేశారని.. అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని సీఎం ప్రశ్నించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com