- నిర్మాతగా రామ్ చరణ్
- అంజనా ప్రొడక్షన్స్‌లో అఖిరా
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఇక ఆయన వారసుడు అయిన అకిరా నందన్ కి ప్రస్తుతం ఫ్యాన్స్‌లో క్రేజ్ పెరిగిందనే చెప్పాలి. హీరోగా ఎంట్రీ ఇస్తే.. ఓ రేంజ్‌లో వెల్కమ్ చెప్పాలని కలలు కంటున్నారు మెగాభిమానులు. అందుకు తగ్గట్టే.. హీరో కటౌట్‌తో కిక్ ఇస్తున్నాడు అకీరా. లేటెస్ట్‌గా రేణు దేశాయ్ షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసి.. పూర్తిగా పొలిటికల్ పైనే ఫోకస్ చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పవన్‌కు జనం జేజేలు కొడితే.. సినిమాలకు గుడ్ బై చెప్పేసినట్టే.
ఇక పై జనంలోనే ఉండబోతున్నాడు పవర్ స్టార్. అందుకే ఆయన లోటుని పూడ్చేందుకు.. వారసుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అంటున్నారు అభిమానులు. కానీ అకీరా హీరో అవుతాడా? లేదా? అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. అయితే అకీరా మాత్రం.. హీరో అయ్యేందుకు ఏమెం కావాలో అన్ని చేస్తున్నాడు. గతంలో అకిరా పియానో వాయించిన వీడియోలు, మార్షల్ ఆర్ట్స్ వీడియోలు, వర్కౌట్ వీడియోలు చూసి మల్టీ టాలెంటెడ్ అని మురిసిపోయారు అభిమానులు.
ఇక ఇదిలా ఉంటే… మెగా వారసుడు అఖిరాబాబు ప్రస్తుతం హీరోగా ఎంట్రీ ఇవ్వాలంటే మరి కథ ఎలా ఉండాలి. ఎలాంటి కథతో ఎంట్రీ ఇస్తాడు. అలాగే ఏ దర్శకుడు.. ఏ రచయితకి ఈ అవకాశం వస్తుంది అన్న విషయం ఫ్యాన్స్‌లో ఆందోళనగా ఉంటే… ఇంతకీ ఏ బ్యానర్‌లో లాంచ్ అవుతాడు అన్నది కూడా ఒక ప్రశ్నగా మిగిలింది. అయితే అఖిరాను తమ సొంత బ్యానర్ అయిన కొణిదల బేనర్ అంజనా ప్రొడక్షన్ లొనే… లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాక మెగా వారసుడు అఖిరా బాబు తొలి సినిమా నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నట్లు సమాచారం. మరి ఇది ఎంత వరకు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.