టాలీవుడ్ యువ సామ్రాట్ సుమంత్, తన అందం,నటనతో ప్రేక్షకులను మెప్పించే మృణాల్ ఠాకూర్‌తో ప్రేమలో మునిగితేలుతున్నారనే వార్తలు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారని, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమంత్ ఇదివరకే ఒక వివాహం చేసుకుని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే, మృణాల్‌తో ఏర్పడిన ఈ బంధం ఆయన జీవితంలో కొత్త వెలుగులు నింపుతోందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మృణాల్ ఠాకూర్ కూడా తన కెరీర్‌లో మంచి ఊపు మీద ఉన్నారు. తెలుగు, హిందీ చిత్రాల్లో వరుస విజయాలతో ఆమె దూసుకుపోతున్నారు. వీరిద్దరు కలిసి సీతరామం సినిమాలో నటించారు. ఈ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని తెలుస్తోంది. సుమంత్‌తో ఆమె ప్రేమ వ్యవహారం ఆమె వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా చెప్పవచ్చు. వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం చాలా బలమైనదని, ఇద్దరూ ఒకరికొకరు అండగా నిలుస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన కొన్ని సినీ వేడుకల్లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే, సుమంత్ కానీ, మృణాల్ కానీ తమ బంధం గురించి అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ, వారి కళ్లలో కనిపిస్తున్న ప్రేమ, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం వారి బంధాన్ని బయటపెడుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి వీరి పెళ్లిపైనే ఉంది. సుమంత్ రెండో పెళ్లి చేసుకుంటారా? మృణాల్ ఠాకూర్‌తో ఆయన బంధం ఎక్కడి వరకు వెళ్తుంది? అనే ప్రశ్నలు అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ వీరిద్దరూ నిజంగానే వివాహం చేసుకుంటే, అది టాలీవుడ్‌లో ఒక సంచలనమే అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.