-
ఆమెతో అక్కినేని నాగచైతన్య వివాహ నిశ్చితార్ధం?
-
ఆమెను రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందుకు సంబందించి నాగచైతన్య వివాహ నిశ్చితార్దం ఈ రోజే జరుగుతోందని ఫిల్మ్ నగర్ టాక్. గత కొన్ని రోజులుగా ప్రముఖ నటి శోభితా ధూళిపాళ్ళతో నాగచైతన్య ప్రేమలో పడ్డారి, ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది కదా. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. అవును అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ళ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారట. వీరి ఎంగేజ్మెంట్ ఈ రోజే అతి కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగబోతోందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
ఏమాయ చేసావే సినిమాలో తనకు జోడిగా నటించిన సమంత తో 2017 అక్టోబరు 6న పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు నాగచైతన్య. ఐతే అనివార్య కారణాల వల్ల వీరి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. వ్యక్తిగత అభి ప్రాయబేధాల నేపధ్యంలో నాగచైతన్య, సమంతలు పరస్పర అంగీకారంతో నాలుగేళ్ల తరువాత 2021లో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇక వీరి విడాకులపై చాలా రకాల చర్చ జరిగింది. నాగచైతన్యదే తప్పని కొందరు, కాదు సమంతాదే తప్పని మరికొందరు సోషల్ మీడియా వేధికగా వాదించారు.
ఆ తర్వాత శోభితా ధూళిపాళ్ళతో నాగ చైతన్య ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది. ఐతే ఇప్పటి వరకు వాళ్లిద్దరు దీనిపై స్పందించలేదు. ఇదిగో ఇప్పుడు హఠాత్తుగా వీళ్లిద్దరి వివాహ నిశ్చితార్ధం జరుగుతుందనే వార్త సంచసలనం రేపుతోంది. ఇరు కుటుంబాలు అంగీకారంతోనే నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ళ అతి కొద్ది మంది పెద్దల సమక్షంలో నిశ్చితార్ధం జరగనబోతుందని సమాచారం. అన్నట్లు అక్కినేని కుటంబానికి కోడలిగా రాబోతున్న శోబిత గతంలో ఫెమినా మిస్ ఎర్త్ 2016 టైటిల్ గెలిచింది. గూడాచారి, మేజర్, పొన్నియన్ సెల్వన్, కురుప్ తదితర సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.