Saturday, January 4, 2025

అక్కినేని నాగేశ్వరరావు అమూల్యమైన కృషిని ప్రశంసించిన ప్రధాని

2024లో తన శత జయంతిని పూర్తి చేసుకున్న భారతీయ సినీ దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావు  అమూల్యమైన సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించారు. “అక్కినేని నాగేశ్వరరావు గారు తన కృషితో తెలుగు సినిమాని కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఆయన సినిమాల్లో భారతీయ సంస్కృతి, వారసత్వం, విలువల వ్యవస్థను ఎంతో గొప్పగా పెంపొందించారు’ అని తెలియజేశారు. ఏఎన్‌ఆర్‌ తన ఏడు దశాబ్దాల కెరీర్‌లో తెలుగు సినిమా వృద్ధి, విజయంలో కీలక పాత్ర పోషించిన అనేక బ్లాక్‌బస్టర్‌లను అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్‌ను నిర్మించడం ద్వారా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్‌కు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించారు. తెలుగు, భారతీయ సినిమాకు ఆయన చేసిన అపారమైన కృషికి గుర్తింపుగా పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించారు. ఈ సంవత్సరం, భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి పురస్కరించుకుని ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. గోవాలోని ఐఎఫ్‌ఎఫ్‌ఐలో ప్రత్యేక నివాళిగా ఏఎన్‌ఆర్‌ క్లాసిక్ చిత్రాలను ప్రదర్శించారు. ఏఎన్‌ఆర్‌ శతజయంతి జన్మదినాన్ని పురస్కరించుకుని, ఏఎన్‌ఆర్‌ ఫ్యామిలీ ఒక గ్రాండ్ ఈవెంట్‌ను నిర్వహించింది, ఈ వేడుకలో లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిని ఏఎన్‌ఆర్‌ జాతీయ అవార్డుతో సత్కరించారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com