లేడీపవర్స్టార్ సాయిపల్లవి ఏదైనా సినిమాలో నటిస్తే ఆ సినిమాకే బ్రాండ్ లాంటిది. ఆమెకు ఉండే క్రేజ్ అలాంటిది మరి. కేవలం సినిమాలో ఆమె ఉంది అన్న పేరుతోనే మార్కెట్ అయిపోతుంది. అంత ఫేమస్ నటి. అంతేకాక పాన్ ఇండియా స్థాయిలో ఈమెకు గుర్తింపు కూడా ఉంది. ఇప్పటివరకూ పాన్ ఇండియాలో సినిమాలు చేయకపోయినా? కేవలం తన నేచురల్ పెర్పార్మెన్స్ తోనే అంతటి ఖ్యాతి సంపాదించింది. అందుకే బాలీవుడ్ పిలిచి మరీ రామాయణంలో సీతను చేసింది. నితీష్ తీవారి తెరకెక్కిస్తోన్న `రామాయణం`లో సీత పాత్రలో పల్లవి నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ అయి హిట్ అయితే? సాయి పల్లవి రేంజ్ అంతకంతకు మారిపోతుంది. మరి ఈ అందమైన పల్లవి అలియాస్ సీతమ్మను ఏ డైరెక్టర్ అయినా తమ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఒప్పించడం అన్నది అతడికి పెద్ద సవాల్ అని అంటున్నాడు చందు మొండేటి. ప్రస్తుతం చందు తెరకెక్కిస్తోన్న `తండేల్` చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇదే సాయి పల్లవి తొలి పాన్ ఇండియా రిలీజ్. ఇందులో సత్య అలియాస్ బుజ్జి తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ పాత్రకు పల్లవిని ఒప్పించడానికి మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వచ్చిందన్నాడు. సాయి పల్లవి ఏ డైరెక్టర్ అయినా కథ, పాత్ర చెబుతానంటే వినదట. తన పాత్ర..స్టోరీ మొత్తం రాసి ఇవ్వమని చెబుతుందట. తాను చదువు కుని నచ్చితే ఒకే చెబుతుంది లేకపోతే లేదట. అయితే `తండేల్` విషయంలో చందు నేరుగా ఆమెని కలిసి నేరేట్ చేయాలనుకున్నాడుట. తాను ఇవ్వాలనుకున్న ఎలివేషన్ రాత పూర్వకంగా ఇవ్వలేను అన్న అపనమ్మకంతో? ఉన్నాడుట. అదే సమయంలో చిత్ర నిర్మాత అల్లు అరవింద్ వద్ద తన పరిస్థితి చెప్పి సాయి పల్లవిని స్టోరీ వినడానికి ఒప్పించారుట. అరవింద్ చెప్పారు కాబట్టి పల్లవి వినడానికి కన్విన్స్ అయిందిట. అలా చందు ..సాయి పల్లవికి స్టోరీ నేరేట్ చేసాడు. కానీ వినే ప్రోసస్ లోనూ చందును చాలా సందేహాలతో ఇబ్బంది పెట్టినట్లు..ఆమెని ఒప్పించడం చిన్న విషయం కాదని అన్నాడు. మరి కథల విషయంలో ఆచితూచి అడుగేస్తుంది కాబట్టే ఆమెకి అంతటి క్రేజ్ అంటూ సోషల్ మీడియాలో మరో వైపు ఈ బ్యూటీ క్వీన్ గురించి మాట్లాడుకుంటున్నారు.