Tuesday, April 22, 2025

గ్రూప్​ –3 అభ్యర్థులకు అలర్ట్​ దరఖాస్తుల్లో ఎడిట్​ ఆప్షన్​

తెలంగాణ గ్రూప్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చింది టీజీపీఎస్‌సీ. గ్రూప్ 3 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మరోసారి ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది. సెప్టెంబర్ 2వ తేదీన ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశం ఇచ్చింది. గ్రూప్ 3 అప్లై చేసుకున్న అభ్యర్థులు తమ అప్లికేషన్‌లో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకోవాలని టీజీపీఎస్‌సీ కమిషన్ తెలిపింది. అభ్యర్థులు టీజీపీఎస్‌సీ వెబ్‌సైట్‌లో నేరుగా లాగిన్ అయి ఎడిట్ చేసుకోవచ్చునని కమిషన్ తెలిపింది.

5,36,477 మంది దరఖాస్తు
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1375 గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం జనవరి 24 నోటిఫికేషన్ జారీ చేసింది. జులైలో పరీక్షలు జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల చేత వాయిదా పడింది. కాగా, ఈ పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com