Thursday, November 14, 2024

తప్పుడు అఫిడవిట్ సమర్పించిన ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య..!

విచారణ చేసి మూడు వారాల్లో చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశం
ఫిర్యాదుదారుడు మహేశ్, బీర్ల అయిలయ్యలకు
ఈనెల 18వ తేదీన హాజరుకావాలని నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్

ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని దీనిపై విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మూడు వారాల్లో చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించింది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్, ఫిర్యాదుదారుడికి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18వ తేదీన ఇరువురు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల కమిషన్ ఎదుట హాజరుకావాలని సూచించింది. దీనికి సంబంధించి తగిన డాక్యుమెంట్‌లతో రావాలని కమిషన్ పేర్కొంది. అయితే బీర్ల అయిలయ్య ఇచ్చిన అఫిడవిట్‌లో తాను గతంలో అమ్మిన భూమిని అమ్మలేదని పేర్కొంటూ డాక్యుమెంట్ నెంబర్‌ను అఫిడవిట్‌లో పొందుపరిచారు. దీనిని ఆసరాగా చేసుకొని ఫిర్యాదుదారుడు మహేశ్ ఆ భూమిని ఎప్పుడు అమ్మారన్న విషయాలపై ఆధారాలు సేకరించడంతో పాటు సర్టిఫై కాపీని సైతం తీసుకున్నారు. ఇలా ఆయన అన్ని ఆధారాలతో కోర్టుకు వెళ్లారు.

ఈనెల 18వ తేదీన మూడు గంటలకు ఎన్నికల కమిషన్ ఎదుట….
గత అసెంబ్లీ ఎన్నికల్లో (2023లో) ఆలేరు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరపున బీర్ల అయిలయ్య పోటీ చేసినప్పుడు ఈ తప్పుడు అఫిడవిట్‌ను సమర్పించారని పేర్కొంటూ 29.05.2024 రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, జిల్లా కలెక్టర్, జిల్లా రిటర్నింగ్ అధికారికి యాదాద్రి జిల్లా గొల్లగూడ గ్రామం, తుర్కపల్లికి చెందిన మహేశ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఫాం 26లోని రూల్ 4 ఏకు సంబంధించి ఎన్నికల సమయంలో బీర్ల అయిలయ్య తప్పుడు అఫిడవిట్ సమర్పించారని మహేశ్ ఫిర్యాదు చేశారు. సెక్షన్ 125 ఏ ప్రతినిధి పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారం ఈ తప్పుడు ఉల్లంఘన జరిగినట్టు మహేశ్ ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు ఈ విషయమై మహేశ్ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం మూడు వారాల్లోగా ఈ ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎలక్షన్ కమిషన్, జిల్లా కలెక్టర్, జిల్లా రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది.

ఈ నేపథ్యంలోనే ఈ నెల 18వ తేదీన ఇరువురు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎదుట హాజరుకానున్నారు. అయితే బీర్ల అయిలయ్య తన దగ్గర ఉన్న ఆధారాలతో ఫిర్యాదు దారుడు సేకరించిన ఆధారాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు వెళ్లాల్సి ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పుడు ఆయన సమర్పించిన పత్రాలు కరెక్ట్ లేవని రిటర్నింగ్ అధికారులు తన నామినేషన్ తిరస్కరించారని, అలాంటప్పుడు బీర్ల అయిలయ్య తప్పుడు అఫిడవిట్‌ను సమర్పిస్తే అధికారులు ఎలా ఒప్పుకుంటారని మహేశ్ ప్రశ్నిస్తున్నారు. అందుకే హైకోర్టును ఆశ్రయించానని మహేశ్ తెలిపారు. అయితే మహేశ్ వివరణ ఇలా ఉంటే, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాత్రం తనపై వచ్చిన ఆరోపణలు తప్పు అని, కావాలనే దురుద్ధేశ్యంతోనే కొందరు ఇలా చేస్తున్నారని ఆయన పేర్కొనడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular