Wednesday, March 12, 2025

కెటిఆర్ అబద్దాలతో ప్రజలను మభ్యబెట్టాలని చూస్తున్నారు

  • గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం వృధా
  • కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జెలకాంతం

కెటిఆర్ అబద్దాలతో ప్రజలను మభ్యబెట్టాలని చూస్తున్నారని, పదేళ్లుగా బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్లు ఇచ్చి ప్రజాధనాన్ని వృధా చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత గజ్జెలకాంతం ఆరోపించారు. ఆదివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ 5వేల మందికి పైగా 2014 నుంచి 23 వరకు ప్రభుత్వ ఉద్యోగ రిటర్మెంట్ పెన్షన్ ఆసరా పెన్షన్ రెండు తీసుకునే వాళ్లు ఉన్నారని, దానిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందని ఆయన అన్నారు.

కెటిఆర్ లబ్ధిదారుల నుంచి పెన్షన్ డబ్బులు వెనక్కి తీసుకుంటుందని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసిందని, రాష్ట్ర ఖజానాను కెటిఆర్ హరీష్ రావులు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజక్ట్‌లో 60 శాతం దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫిరాయిపులకు పాల్పడుతుందని, మహేశ్వర్ రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, 2014 నుంచి 2023 వరకు డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొన్న బిఆర్‌ఎస్ పార్టీకి అప్పుడు ఫిరాయింపుల చట్టం గుర్తురాలేదా ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలని ఎమ్మెల్యేలను కొన్నది వాస్తవం కాదా కెసిఆర్, కెటిఆర్ దొరతనం నియంత పోకడలు నచ్చకనే ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com