Tuesday, April 22, 2025

అలిగిన సోగ్గాడు.. ఎందుకంటే?

టాలీవుడ్‌ అందగాడు.. సోగ్గాడు.. శోభన్‌ బాబు. ఆయన ఎన్నో మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. ఇంకా చెప్పాలంటే ఆయన మల్టీస్టారర్‌ చిత్రాలతోనే ఎదిగారు. కెరీర్‌ ప్రారంభంలో ఆయన అన్నీ మల్టీస్టారర్‌లోనే చేశారు. అలాంటి శోభన్‌బాబు ఓ దశలో మల్టీస్టారర్‌ చిత్రాలు చేయనంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. అంతేకాదు పరుచూరి బ్రదర్స్ పై మండిపడ్డారు. మరి దీనికి కారణమేంటి? అసలు ఎక్కడ దెబ్బకొట్టింది? సోగ్గాడు అంతగా బాధపడిన సంఘటన ఏమిటంటే…
శోభన్‌ బాబు సిస్టమాటిక్‌ లైఫ్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ అని చెప్పవచ్చు. ఆయన సినిమా జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని మిళితం చేయరు. ఇంటికెళ్తే సినిమాలను మర్చిపోతారు, సెట్‌కి వెళ్తే ఫ్యామిలీ గురించి పట్టించుకోరు. షూటింగ్‌లో కూడా షెడ్యూల్‌ ప్రకారం వస్తారు. టైమ్‌కి వెళ్లిపోతారు. సాయంత్రం ఆరు అయ్యిందంటే ఒక్క నిమిషం కూడా ఉండరట. అలాగే మార్నింగ్‌ టైమ్ కి సెట్‌లో ఉంటారు. షూటింగ్‌ కాస్త అటు ఇటు అయినా ఆయన పట్టించుకోరు.

తన జీవితం విషయంలోగానీ, మనుషులతో రిలేషన్‌ విషయంలోనూ ఒక పద్ధతిని పాటిస్తారు శోభన్‌ బాబు. సినిమాల్లో పాత్రల విషయంలో కూడా అదే కచ్చితత్వంతో ఉంటారట. అయితే ఓ మల్టీస్టారర్‌ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగింది. తన పాత్రని గొప్పగా చెప్పి, ఆ తర్వాత కట్‌ చేశారు. దీంతో తన పాత్ర తగ్గిపోయి సైడ్‌ క్యారెక్టర్‌లా మారిపోయింది. మరో హీరో పాత్ర ఎలివేట్‌ అయ్యింది. ఇది ఫైనల్‌గా చూసుకున్న శోభన్‌ బాబు హర్ట్ అయ్యారు. ఆవేశంతో ఊగిపోయారు. ఇకపై మల్టీస్టారర్‌ చేయనంటూ ప్రకటించారు. ఆ రైటర్స్ పై ఫైర్‌ అయ్యారు. శోభన్‌ బాబు.. సూపర్‌ స్టార్‌ కృష్ణతో కలిసి చాలా సినిమాలు చేశారు. అలా `మహాసంగ్రామం` అనే చిత్రంలో కలిసి నటించారు. దీనికి కోదండరామిరెడ్డి దర్శకుడు. తిరుపతి రెడ్డి నిర్మాత. పరుచూరి బ్రదర్స్ రైటర్స్ గా పనిచేశారు. ఈ మూవీ 1985 ఫిబ్రవరి 14న విడుదలైంది.

అప్పట్లో కోటీ రూపాయల బడ్జెట్‌తో రూపొందిన మూవీ. అంటే భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. భారీగా ప్రమోషన్స్ చేశారు. తొలి రోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. కానీ పెద్ద ఫ్లాప్‌ అయ్యింది. అయితే ఈ మూవీలో సూపర్‌ స్టార్‌ కృష్ణ పాత్ర హైలైట్‌ అయ్యింది. శోభన్‌ బాబు పాత్రని డల్‌ చేశారు. చాలా సీన్లు కట్‌ చేశారు.

దీనికి ఓ కారణం ఉంది. ఈ మూవీ సెన్సార్‌ జరిగే టైమ్‌లో అందులో సభ్యునిగా ఒక మిలటరీ అధికారి ఉన్నారట. ఆయన శోభన్‌ బాబు పాత్ర తమ నియమాలకు విరుద్ధంగా ఉందని చాలా సీన్లు కట్ చేయించారట. అలా శోభన్‌ బాబు పాత్ర తగ్గిపోయింది. కానీ ఆ విషయం తెలియక పరుచూరి బ్రదర్స్ తక్కువగా రాశారని భావించి, వాళ్లు కనిపిస్తే చంపేస్తాననే బెదిరించారట.

అంతేకాదు ఆ టైమ్‌లోనే తాను ఇకపై మల్టీస్టారర్ చిత్రాలు చేయనంటూ ప్రకటన కూడా చేశారట. అయితే జరిగిన విషయం తర్వాత తెలియడంతో మరో మూవీ సెట్‌లో పరుచూరి బ్రదర్స్ పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నట్టు తెలిపారట శోభన్‌ బాబు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com