బ్యాలెట్ పోరే దేశానికి శ్రీరామరక్ష
ఏదో ఒకరోజు మోదీ దేశాన్ని అమ్మేస్తారు
ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
ప్రధాని మోదీ ఏదో ఒకరోజు దేశాన్ని అమ్మేస్తారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్ అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ – (ఎఐసిసి) సమావేశాలు జరుగుతున్నాయి. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ’దేశ ఆర్థిక వ్యవస్థలో గుత్తాధితప్యం నెలకొల్పబడుతోంది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ దెబ్బతింది. వారు బలహీన వర్గాల వారికి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వారు ప్రభుత్వరంగాన్ని ఒక్కొక్కటిగా అమ్మేస్తూ.. తమ స్నేహితులకు సహాయం చేస్తున్నారు. ఇదే కొనసాగితే.. మోదీ ఏదో ఒకరోజు ఈ దేశాన్ని అమ్మేస్తారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నిర్మించిన ప్రభుత్వ రంగ కర్మాగారాలను నాశనం చేస్తున్నారు. రు, నేను దేశం కోసం ఏం చేస్తున్నాం? భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము? కాంగ్రెస్‌ను దుర్భాలాషలాడడం తప్ప మోదీ దగ్గర వేరే సమాధానాలు లేవు అని ఆయన అన్నారు.
నేడు ఎన్నికల సంస్థలు కూడా వారి నియంత్రణలోకే వెళ్లాయి. ప్రభుత్వం ప్రతిదానిలో జోక్యం చేసుకుంటూ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఎన్నికల్లో మోసాలు జరుగుతున్నాయి. ఎలక్టాన్రిక్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో.. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఇవిఎంలను వదిలి బ్యాలెట్‌పేపర్స్ వైపు మళ్లాయి. ప్రపంచంలో ఇవిఎంలు ఎక్కడా అందుబాటులో లేవు. దేశంలో 140 కోట్ల మంది ప్రజాస్వామ్యాన్ని నమ్ముతారు. ఇప్పుడో లేక తరువాతో.. ఈ దేశ యువత మనకు ఇవిఎంలు వద్దు.. బ్యాలెట్ పేపర్లు కావాలని నినదిస్తారు అని ఖర్గే అన్నారు.భారత్‌పై అమెరికా 26 శాతం పన్నులను విధించింది. ఈ విషయంపై పార్లమెంటు చర్చించనీయలేదు. ఈ విషయంపై మేము చర్చించాలని పట్టుబట్టాము. కానీ వారు చర్చకు అనుమతించలేదు.
ముఖ్యమైన ప్రజా సమస్యలను చర్చించడానికి బదులుగా.. ప్రభుత్వం పార్లమెంటు-లో మత విభజన గురించి చర్చించింది. దీనికోసం తెల్లవారుజామున 3-4 గంటల వరకు చర్చలు నిర్వహించింది. మణిపూర్ వంటి అంశాలపై ఉదయం 4.40 గంటలకు ప్రారంభమైంది. ఆరోజు మణిపూర్ అంశంపై మేము తరువాతరోజు మాట్లాడతామని అమిత్‌షాకు చెప్పాము. దీంతో ఈ విషయంపై మమ్మల్ని చర్చకే అనుమతించలేదు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఆ నేతలు ఇలాంటివి చేస్తున్నారు అని ఖర్గే విమర్శించారు. ఈ ప్రభుత్వానికి యువతకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశం లేదు. దేశంలో అన్నింటా ప్రభుత్వ ఆధిపత్యమే కొనసాగుతున్నదని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నదని, అందుకే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.