Wednesday, December 25, 2024

ఇండియాలోని ఏడు మేజర్‌ సిటీస్‌లో ఇండియన్‌ ఫిల్మ్‌ పుష్ప-2

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్‌ ఫిల్మ్‌ ‘పుష్ప-2 ది రూల్‌’. ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని సుకుమార్‌ రైటింగ్స్‌ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 12 వేల స్క్రీన్స్‌లో అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్‌లో అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంది. అయితే ఈ చిత్రం ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ కోసం భారతదేశంలోని సినీ ప్రేమికులు, ఐకాన్‌ స్టార్‌ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ చిత్రం ప్రమోషనల్‌ ఈవెంట్స్‌ను ఇండియాలోని ఏడు మేజర్‌ సిటీస్‌లో నిర్వహించబోతున్నట్లుగా మేకర్స్‌ అఫీషియల్‌గా విడుదల చేసిన ఓ వీడియో ద్వారా తెలియజేశారు. పాట్నా, కలకత్తా, చెన్నయ్‌, కొచ్చి, బెంగళూరు, ముంబయ్‌ హైదరాబాద్‌లో ఈ మాసివ్‌ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఒకవైపు చివరి దశలో వున్న చిత్రీకరణతో పాటు మరో వైపు నిర్మాణానంతర పనులను ఈ చిత్రం జరుపుకుంటోంది. ఇక బాక్సీఫీస్‌ రికార్డులను రూపుమాపడానికి, ఇండియాను కలెక్షన్ల తుఫాన్‌ షేక్‌ చేయడానికి ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌- బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల వండర్‌ఫుల్‌ ఫిల్మ్‌ పుష్ప-2 ది రూల్‌ సర్వాంగ సుందరగా ముస్తాబు అవుతుంది.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com