రాష్ట్ర సీఎం, మంత్రులు విదేశాలు, ఇతర రాష్ట్రాల బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఈ రెండు రోజులు కేబినెట్ మొత్తం లేకుండా నిలిచింది. సగం శాఖల మంత్రులు విదేశీ పర్యటనలో, మరో సగం శాఖల అమాత్యులు పక్క రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. మంత్రుల వారీగా చూస్తే ముఖ్య మంత్రి హోదాలో సీఎం విదేశాల్లో ఉండగా.. ఆయన నిర్వహిస్తున్ర హోమ్, విద్యా, మున్సిపల్ శాఖల మంత్రి కూడా స్థానికంగా లేరన్నట్టే.
ఇక మంత్రుల వారీగా పరిశీలిస్తే..
కార్మిక మంత్రి- విదేశంలో
గిరిజన మంత్రి – విదేశంలో
సోషల్ వెల్ఫేర్ మంత్రి- విదేశంలో
మైనారిటీ మంత్రి- విదేశంలో
ఐటీ, పరిశ్రమ మంత్రి – విదేశంలో
ఖనిజ శాఖా మంత్రి- విదేశంలో
ఆర్థిక మంత్రి – కర్ణాటకలో
నీళ్ల మంత్రి- కర్ణాటకలో
గ్రామీణ మంత్రి- కర్ణాటకలో
రోడ్ల మంత్రి – ఇంట్లో
ఆరోగ్య మంత్రి- కర్ణాటకలో
అటవీ మంత్రి- కర్ణాటకలో
ఎక్సైజ్ మంత్రి – కర్ణాటకలో
బీసీ, రవాణా మంత్రి- కర్ణాటకలో
వ్యవసాయ మంత్రి- కర్ణాటకలో ఉన్నారు.