Sunday, October 6, 2024

క్రమ శిక్షణకు అలెన్ మారుపేరు: జాతీయ బ్యాడ్మింట్న్ చీఫ్ కోచ్ గోపీచంద్

అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ క్రమశిక్షణకు మారుపేరని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని నోవోటెట్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అలెన్ వంటి ప్రతిష్టాత్మక విద్యా శిక్షణా సంస్థ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం శుభపరిణామమన్నారు. ప్రతిభావంతులైన విద్యార్ధులు తమ నైపుణ్యాలను మరింత సాన పెట్టుకునేందుకు అలెన్ ఒక మంచి వేదిక అని, దశాబ్దాలుగా విజయానికి, క్రమశిక్షణకు పర్యాయపదంగాఅలెన్ నిలిచిందన్నారు. వారు హైదరాబాద్ విద్యారంగంలో శ్రేష్ఠత పరంగా నూతనబెంచ్‌మార్క్‌ను ఏర్పాటు చేస్తున్నారని, ఇక్కడకు రావడం ద్వారా,తెలంగాణ నుండి ఎక్కువ మంది అగ్రశ్రేణి ర్యాంకర్లను తీర్చి దిద్దడమే కాకుండా,సరైన మార్గదర్శకత్వం , సంరక్షణతో సాధ్యమయ్యే సరిహద్దులను అధిగమించడానికి రాబోయే తరం విద్యార్థులను సైతం ప్రేరేపిస్తుందని నమ్ముతున్నానన్నారు.

కోటా యొక్క ప్రఖ్యాత తరగతి గది వాతావరణంలో శిక్షణ అందించిన వారితో సహా భారతదేశం అంతటా ఉన్న స్టార్ ఫ్యాకల్టీ సభ్యులు, అనుభవజ్ఞులైన విద్యావేత్తల బృందం,హైదరాబాద్ క్యాంపస్‌లలో ఉన్నత స్థాయిబోధన, మార్గదర్శకత్వం కు భరోసా అందిస్తుందన్నారు. పాఠ్యాంశాలపై అమితంగా దృష్టి సారించే అలెన్, విద్యార్థుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్ని క్యాంపస్‌ల మాదిరిగానే,హైదరాబాద్ క్యాంపస్‌లు కూడా విద్యార్థులందరికీ అధ్యాపకులు మానసిక సలహాదారులతో ముఖాముఖి సెషన్‌లను అందిస్తాయన్నారు. ఈ అమూల్యమైన మద్దతు విద్యార్థుల అధ్యయనం, ఆరోగ్యం పట్ల సమతుల్య విధానాన్ని నిర్వహించడానికి సహాయపడుతుందని చెప్పారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, అక్షర విద్యాసంస్థల ఛైర్మన్ జగన్ మోహన్ రావు మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌కు కేరాఫ్ గోపీచంద్ అకాడమీ ఎలానో పోటీ పరీక్షల శిక్షణకు అలెన్ కూడా అంతే విశిష్టమైన సంస్థ అని చెప్పారు.

హైదరాబాద్‌లో అలెన్, అక్షర విద్యాసంస్థలు కలిసి పనిచేస్తాయని అన్నారు. విద్యార్థులకు మేలు చేకూర్చడమే తమ లక్షమన్నారు. అలెన్ సంస్థ సీఈఓ నితిన్ కుక్రేజా మాట్లాడుతూ తొలి దశలో భాగంగా ఐదు క్యాంపస్‌లను ప్రారంభించనున్నామని, వచ్చే మూడేళ్లలో 20 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే తమ లక్షమన్నారు. భారతదేశం అంతటా విద్యార్థులను శక్తివంతం చేసే అలెన్ ప్రయాణంలో హైదరాబాద్ తదుపరి అధ్యాయానికి ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. శ్రేష్ఠత పట్ల నిబద్ధత, సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా తాము కేవలం విద్యాపరమైన ఫలితాలను మాత్రమే కాకుండా జీవితాలను మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. భారతదేశ కోచింగ్ పరిశ్రమలో అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క 36 -సంవత్సరాల వారసత్వం జాతీయ పరీక్షల్లో స్థిరమైన విజయంతో గుర్తించబడిందన్నారు.

ఈ సంస్థ గత 15 సంవత్సరాల్లో ఐఐటి- జెఈఈ, నీట్ /ఏఐపిఎంటిలో 25మంది ఆలిండియా ర్యాంక్ -1 హోల్డర్లను తయారు చేసిందని చెప్పారు. 2024లో ఐఐటిలలో ప్రవేశించిన ప్రతి ఐదుగురు విద్యార్థుల్లో ఒకరు అలెన్ తరగతి గదుల నుండి వచ్చారని, తమ విద్యార్థి వేద్ లహోటి జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్- 1 సాధించారన్నారు. నీట్ 2024లో తమ విద్యార్థుల్లో ఐదుగురు మజిన్ మన్సూర్,ప్రచిత, దివ్యాంష్ జితేంద్ర, నేహా మానే, తేజస్ సింగ్ ఆలిండియా ర్యాంక్ -1సాధించారని తెలిపారు. ఈ సంవత్సరం తమ విద్యార్థుల్లో 45మంది జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్100లో ర్యాంక్ సాధించారని, 39మంది విద్యార్థులు నీట్ లో టాప్100లో ఉన్నారని, భారతదేశంలోని ఏ ఇన్‌స్టిట్యూట్‌లో లేని సంఖ్యలో అత్యధిక విద్యార్థులు తమ సంస్థ నుంచి వచ్చారని వివరించారు. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డీ అనుప్ యమ, సౌత్ ఇండియా హెడ్ మహేష్ యాదవ్, అలెన్, అక్షర సిబ్బంది పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular