పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ తో బిఎస్పీ పొత్తులో భాగంగా ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం..రెండు సీట్లను బీఎస్పీ కి కేటాయించాలని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.అందులో భాగంగా.. నాగర్ కర్నూల్ మరియు హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.కాగా…సంబంధిత రెండు స్థానాల్లో అభ్యర్థులను బీఎస్పీ ఖరారు చేసుకోనున్నది.