Tuesday, May 6, 2025

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

బిఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరిన తర్వాత గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వీరితో పాటు ఇన్‌ఛార్జీ దీపాదాస్ మున్షీ, ఎమ్మెల్యే కొమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇతర పార్టీ నేతలు ఉన్నారు. అనంతరం తాజాగా రాజకీయ పరిణామాలపై నేతలు వారు చర్చించినట్లు తెలిసింది. కాగా, లోక్ సభ ఎన్నికల వేళ ఇప్పటికే బిఆర్‌ఎస్ కీలక నేతలు వీడడంతో పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. తాజాగా కాంగ్రెస్‌లో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బలమైన నేత కారు దిగేయడం బిఆర్‌ఎస్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బిఆర్‌ఎస్ పార్టీకి బుధవారం రాజీనామా చేసిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జీ దీపా మున్షీ సమక్షంలో బుధవారం హస్తం పార్టీలో చేరారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com