అల్లు అర్జున్ అరెస్ట్‌పై హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. ఈ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని బన్ని తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో ఈ పిటిషన్ ను న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి మెన్షన్ చేశారు. సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. అయితే, వెంటనే ఈ క్వాష్ పిటిషన్ పై విచారణ చేయలేమని, నిర్ణయం తీసుకోమని, పోలీసుల నుంచి రిప్లై తర్వాత మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత చెబుతామని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దీంతో విచారణనకు 2.30 గంటలకు వాయిదా వేశారు.