Tuesday, December 24, 2024

అల్లు అర్జున్‌ ఇంటి దాడి కేసులో నిందితులకు బెయిల్‌

అల్లు అర్జున్‌  ఇంటిపై దాడి కేసులో నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి అల్లు అర్జున్‌పై విమర్శలు చేయడం, తన వ్యక్తిత్వంపై దుష్ప్రచారం జరుగుతున్నదని అల్లు అర్జున్‌ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆదివారం మరోసారి ఉద్రిక్తత పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్‌ ఇంటిపై 10 మంది యువకులు దాడి చేశారు. గేట్లను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లారు. అడ్డుకున్న సిబ్బందిని చితకబాదారు. ఆవరణలోని పూలకుండీలను ధ్వంసం చేశారు.

పోలీసులు అక్కడికి వొచ్చి యువకులను అరెస్ట్‌ చేశారు. అల్లు అరవింద్‌ మేనేజర్‌ కాంతారావు ఫిర్యాదు మేరకు కేసు బీఎన్‌ఎస్‌ 331(5), 190, 191(2), 324(2), 292, 126(2), 131 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ఓయూ జేఏసీ నేతలుగా చెప్పుకున్న వారిని చౌటుప్పల్‌కు చెందిన నాగరాజ్‌, యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన నగేశ్‌, కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన రెడ్డి శ్రీనివాస్‌, మోహన్‌, చర్లపల్లికి చెందిన ప్రేమ్‌కుమార్‌, షాద్‌నగర్‌కు చెందిన ప్రకాశ్‌గా గుర్తించారు. కాగా, సోమవారం ఉదయం జూబ్లీహిల్స్‌ పోలీసులు నిందులను వనస్థలిపురంలోని జడ్జి నివాసంలో హాజరుపరిచారు. దీంతో వారికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. రూ.10 వేల చొప్పున ఒక్కొక్కరు రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించారు.

ఓయూ జేఏసీ నేతలు కాదు.. దాడికి పాల్పడిన వారు ఓయూ జేఏసీ పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు. కానీ వాళ్లు ఓయూ జేఏసీ నేతలు కాదని పోలీసులు స్పష్టంచేశారు. దాడిలో కీలక పాత్ర పోషించిన రెడ్డి శ్రీనివాస్‌ కొడంగల్‌ నియోజకవర్గానికి చెందిన యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా గుర్తించారు. 2019లో కాంగ్రెస్‌ నుంచి జడ్పీటీసీగా కూడా పోటీ చేశాడని, అతడు సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డికి అత్యంత సన్నిహితంగా వ్యవహరిస్తుంటాడని తెలుస్తోంది . మిగిలిన యువకులు కూడా కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా పని చేస్తున్నారని సమాచారం. మరోవైపు దాడిలో పాల్గొన్న రెడ్డి శ్రీనివాస్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మళ్లీ 1500మందితో వొచ్చి దాడి చేస్తామని ఆ వీడియోలో హెచ్చరించాడు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com