పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత ఇండియా , పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. మేము మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసింది భారత్ ఆర్మీ. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడంపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందించారు. దీనిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం స్పందించారు. ” మే బీ జస్టిస్ సర్వ్‌డ్.. జై హింద్” అనే క్యాప్షన్‌తో పోస్ట్ పెట్టాడు. ఇండియన్ ఆర్మీకి ఫుల్ సపోర్టు చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ చేసిన ట్వీట్ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొందరు ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటీ అల్లు అర్జున్ ఇండియాకు మద్దతుగానే అల్లు అర్జున్ ట్వీట్ చేశారు కదా అలాంటిది, ఆయనపై ఆగ్రహం ఎందుకని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అల్లు అర్జున్ మీద మండిపడుతున్నది ఇండియన్ అభిమానులు కాదు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఫ్యాన్స్. అల్లు అర్జున్‌కు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. ఇలా తమ అభిమాన హీరో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడటంపై అక్కడి అభిమానులు ఫైర్ అవుతున్నారు. మా అభిమాన హీరో నుంచి ఇలాంటి పోస్ట్ ఎక్స్‌పెక్ట్ చేయలేదంటూ బాధపడుతున్నారు.అల్లు అర్జున్ చేసిన పోస్ట్‌పై 40వేలకు పైగా కామెంట్స్, 100వేల డిజప్పాయింట్‌మెంట్ రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు ఆ పోస్ట్ డిలీట్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. ఇది చూసిన వారందరూ అల్లు అర్జున్‌కు ఇండియాలోనే కాకుండా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లో కూడా ఇంత కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనప్పటికీ అల్లుఅర్జున్ ఇండియన్ కదా కాబట్టి ఆయన పెట్టిన ట్వీట్‌లో తప్పేమీలేదంటూ కొందరు ఫ్యాన్స్ అంటున్నారు.